చలికాలం కూడా పూర్తి స్థాయి యుద్ధం చేస్తాం: ఇండియన్ ఆర్మీ

-

సరిహద్దుల్లో ఉద్రిక్త వాతారణం నేపధ్యంలో భారత ఆర్మీ కీలక వ్యాఖ్యలు చేసింది. తూర్పు లడఖ్‌ లో శీతాకాలంలో కూడా పూర్తి స్థాయి యుద్ధానికి భారత ఆర్మీ పూర్తిగా సిద్ధంగా ఉందని భారత సైన్యం బుధవారం తెలిపింది. చైనా యుద్ధానికి పరిస్థితులను సృష్టించినట్లయితే, వారు మెరుగైన శిక్షణ పొందిన, ప్రతీ ఒక్క దానికి సిద్ధమైన, మానసికంగా బలంగా ఉన్న భారత దళాలను ఎదుర్కొంటారని ఆర్మీ పేర్కొంది. శారీరకంగా మరియు మానసికంగా యుద్ధానికి భారత దళాలు సిద్దంగా ఉన్నాయని ఆర్మీ తెలిపింది.

చైనా ఆర్మీలో ఎక్కువగా పట్టణ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారని వారికి క్షేత్ర స్థాయిలో అది ఇబ్బంది అని పేర్కొంది. భారత్ యుద్దానికి సిద్దంగా లేదని… తగినంతగా ఆయుధాలను సమకూర్చబడలేదని… శీతాకాలంలో సమర్థవంతంగా పోరాడలేరని… చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ నివేదికలపై ఆర్మీ నార్తర్న్ కమాండ్ ప్రధాన కార్యాలయం ఈ వ్యాఖ్యలు చేసింది

Read more RELATED
Recommended to you

Latest news