ప్రముఖ స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖీ షో కి అనుమతి లభించింది. ఆగస్టు 20వ తేదీన హైదరాబాదులోని హైటెక్స్ లో మునావర్ ఫారుఖీ కామెడీ షోకు అనుమతి లభించింది. అయితే దీనికి అనుమతి ఇస్తే తీవ్ర స్థాయిలో పరిణామాలు ఉంటాయని భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి హెచ్చరిస్తూ వస్తుంది. గతంలో మునావర్ హిందూ దేవుళ్ళపై జోకులు వేశారని.. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని బిజెపి ఆరోపిస్తోంది.
ఇప్పటికే మునావర్ ఫారుకి షో విషయంలో అనేకమార్లు హెచ్చరికలు జారీ చేశారు గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్. తాజాగా మరో మారు మునావర్ కి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ లో మునావర్ ఫారుకి షో నిర్వహిస్తే ఆ ప్రదేశాన్ని తగలబెడతాం అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ ఈవెంట్ నిర్వహించకుండా ఆపాలని తెలంగాణ పోలీసులకు, ప్రభుత్వానికి ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. మునావర్ ఫారూఖి కి ఎవరైనా సహకరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని తేల్చి చెప్పారు.