మునుగోడులో పోలింగ్ దగ్గర పడే కొద్ది రాజకీయం వేడెక్కుతోంది. దాడులు, ప్రతి దాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. నిన్న కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కాన్వాయ్ లోని కారుపై బీజేపీ శ్రేణులు దాడి చేయగా, దానికి నిరసనగా రాత్రి బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ శ్రేణులు చెప్పుతో దాడి చేశాయి. ఇది ఇలా ఉండగా.. టీఆర్‌ఎస్ పార్టీ మాత్రం.. బీజేపీ, కాంగ్రెస్ లకు భిన్నంగా ప్రచారం లో దూసుకుపోతోంది.
మునుగోడులోని దండు మల్కాపూర్ లో 2019 లో తమ ప్రభుత్వం ఆసియాలో అతిపెద్ద ఇండస్ట్రియల్ పార్కును నెలకొల్పిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఓ వీడియోను పంచుకున్న ఆయన, ’35 వేల మంది స్థానిక యువతకు ఉపాధిని అందించేలా ఈ ఇండస్ట్రియల్ పార్కులో ఫుడ్ ప్రాసెసింగ్, టాయ్ పార్కు కూడా వస్తోంది. లక్షల ఉద్యో గాలు వచ్చేలా కృషి చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి యువత అండగా నిలబడాలి’ అని పిలుపునిచ్చారు.