ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం జరిగింది. మచిలీ పట్నంలోని తన నివాసంలోనే దుండగుడు తాపీతో దాడి చేయబోయాడు. వెంటనే మంత్రి అనుచరులు అడ్డుకోవడంతో మంత్రి నాని తృటిలో తప్పించుకున్నాడు. దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐతే ఆ దుండగుడు ఎవరు, ఎందుకు దాడి చేసారనే విషయం ఇంకా బయటకి రాలేదు. మంత్రి పేర్ని నాని గారి తల్లి ఇటీవలే స్వర్గస్తులవడంతో దానికి సంబంధించిన కార్యక్రమాల కోసం మచిలీపట్నం వెళ్ళిన నానిగారు మార్కెట్ కి వెళ్తుండగా మర్డర్ అటెంప్ట్ జరిగింది.
ఈ దాడిలో నాని గారి బట్టలు పూర్తిగా చిరిగిపోయాయి. వెంటనే మంత్రి అనుచరులు అడ్డుకోవడంతో మంత్రి గారికి ప్రమాదం తప్పింది. మరి ఈ దాడి ఎందుకు చేసారు? ఎవరు చేసారు? కారణాలేంటన్న విషయాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం దుండగుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఇలా చేసారా? రాజకీయ కోణం ఏమైనా ఉందా అనే విషయాలు తెలియాలి.