ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎం జరుగుతుంది…? అధికార పార్టీ నేతలు, ప్రధానంగా కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అనుసరిస్తున్న వైఖరిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. శివరాత్రి సందర్భంగా చిలకలూరిపేట లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి నరసరావు పేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలు రాగా ఆయన్ను విడదల రజనీ వర్గం అడ్డుకుని ఇబ్బంది పెట్టింది.
దీనితో ఆయన ఏమీ చేసేది లేక వెనుతిరిగారు. విడుదల రజని విషయంలో ఇలాంటివి కొత్త కాదు. తాడికొండ నియోకకవర్గంలో కూడా కొన్ని కార్యక్రమాలకు ఆమె హాజరు కావడంతో అక్కడి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనితో అసలు ఎం జరుగుతుంది అనేది చాలా మందికి అర్ధం కాలేదు. నరసరావు పేట పార్లమెంట్ పరిధిలోనే చిలకలూరిపేట ఉంది. మరి అలాంటప్పుడు ఎందుకు అడ్డుకున్నారు ఎంపీని…?
ఇప్పుడు విడదల రజని కాన్వాయ్ పై దాడి జరిగింది. ఈ దాడిలో ఎమ్మెల్యే కారు అద్దాలు ద్వంశం అయ్యాయి కోటప్పకొండ… కట్టుబడివారిపాలెంలో అర్థరాత్రి 1 గంట సమయంలో ఈ దాడి చేసారు కొందరు. ఎమ్మెల్యే రజనీ మరిది గోపీ… కోటప్పకొండకు వెళ్లి ప్రభలను ఇచ్చి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది అంటున్నారు. కారులో ఎమ్మెల్యే రజనీ ఉన్నారన్న ఉద్దేశంతో దుండగులు… కారుపై రాళ్లు, కర్రలతో దాడి చేశారని అంటున్నారు.
ఆమె మరిది గోపీ మాత్రమే ఉన్నారని అర్ధం కావడంతో ప్రత్యర్థులు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న సమయంలో… వైసీపీ కార్యకర్తలు అక్కడకు వచ్చారు. దీనితో అసలు వైసీపీ కార్యకర్తలకు వారికి మధ్య వివాదం చెలరేగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై వైసీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలపై అనుమానం వ్యక్తం చేస్తున్నా, ఎంపీ లావు వర్గమే దాడి చేసింది అంటున్నారు.