కోడి కూర వండలేదని కర్రతో కొట్టి చంపాడు…!

-

కొంత మంది చెప్పింది జరగాలి అనే మనస్తత్వంలో ఉండి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. తమకు నచ్చింది జరగకపోతే ప్రాణం పోయినట్టు భావించే వాళ్ళు ఎక్కువగా మన చుట్టూ కనపడతారు. తాజాగా ఒక వ్యక్తి… కోడిని తెచ్చి కూర వండలేదు అని భార్యను కర్రతో కొట్టి చంపాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. మల్లిశాల గ్రామశివారు జీడిమామిడి తోటలో గత నెల 28న మహిళ హత్యకు గురైంది.

ఈ కేసులో నిందితుడుని సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలని సిఐ రాంబాబు మీడియాకు వివరించారు. మల్లిశాల గ్రామంలో అత్తలూరి శ్రీనివాసరావుకు చెందిన జీడిమామిడి తోటలో రంపచోడవరం మండలం సోకులగూడెం గ్రామానికి చెందిన తోకల వెంకటేశులు అలాగే సిరికింతలపాడు గ్రామానికి చెందిన నేషం లక్ష్మి సహజీవనం చేస్తున్నారు. ఆ తోటలో వీళ్ళు కాపలా దారులుగా ఉంటున్నారు.

మార్చి 28న వెంకటేశులు కోడిని తీసుకువచ్చి కూర వండాలని చెప్పగా అందుకు ఆమె అంగీకరించలేదు. ఆగ్రహానికి గురైన అతను… కర్రతో ఆమెను ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. ఆ తర్వాత ఆమె శవాన్ని… సిరికింతలపాడు తీసుకుని వెళ్లగా దీన్ని గ్రహించిన ఆమె కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా శవ పంచనామా నిర్వహించారు. నిందితుడు పారిపోయాడు. అతను మల్లిశాల గ్రామ వీఆర్వో దగ్గర లొంగిపోయినట్లు పోలీసులు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news