ఈ 10 నెలల బుడ్డోడు మామూలోడు కాదు, కరోనాను జయించాడు…!

-

కరోనా వైరస్ ఇప్పుడు చిన్న పిల్లలకు 60 ఏళ్ళు దాటిన వారికి నరకం చూపిస్తున్న సంగతి తెలిసిందే. వైద్యులు కూడా వారికి అనేక జాగ్రత్తలు చెప్తున్నారు. వారు అసలు బయటకు ఏ విధంగాను రావొద్దని సూచనలు చేస్తున్నారు. అయినా సరే కరోనా వైరస్ వారి మీద ఎక్కువగా ప్రమాదం చూపిస్తుంది. రోజుల వ్యవధిలో ఉన్న పిల్లల మీద కూడా కరోనా తన ప్రతాపం చూపించడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు.

ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక 10 నెలల బాలుడు కరోనా వైరస్ నుంచి పూర్తిగా బయటపడటం విశేషం. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఆ శిశువుకి కరోనా పాజిటివ్ రావడం తో కోయంబత్తూరు లోని ఈఎస్ఐ ఆస్పత్రిలో జాయిన్ చేసారు. మార్చ్ 29 న జాయిన్ చేయగా… ఆ చిన్నారి తల్లి, నాయనమ్మ, వారి పనిమనిషి కూడా కరోనా వైరస్ బారిన పడటం ఆందోళన కలిగించింది.

ఎనిమిది రోజులు చికిత్స చేసిన వైద్యులు ఏప్రిల్ ఆరు న శిశువుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసారు. తల్లి, నాయనమ్మ, పనిమనిషి కూడా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తల్లి ద్వారా బాలుడికి కరోనా రాగా… రాష్ట్రంలో కరోనా 45 వ బాధితుడు ఆ బాలుడు. బాలుడు తల్లి ఈరోడ్‌ రైల్వే ఆస్పత్రిలో వైద్యురాలికి… ఢిల్లీ మర్కాజ్ వెళ్లి వచ్చిన 26 ఏళ్ళ రోగి ద్వారా బాలుడి తల్లికి కరోనా సోకింది.

Read more RELATED
Recommended to you

Latest news