పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ను చివరి దశలోనైనా స్వదేశానికి రప్పించాలని ఆ దేశ ఆర్మీ భావిస్తోంది. ముషారఫ్ ప్రస్తుతం దుబాయ్ లో తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ముషారఫ్ ను పాక్ తీసుకు వచ్చే ఉద్దేశంతో ఆర్మీ అధికారులు ఇప్పటికే ఆయన కుటుంబాన్ని సంప్రదించారు. కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపితే ఆయనను తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని, దేశంలో తగిన చికిత్స అందిస్తామని ఆర్మీ ప్రకటించింది.
ముషారఫ్ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని కూడా హామీ ఇచ్చింది. అయితే ఈ విషయంలో కుటుంబ సభ్యుల అంగీకారం తో పాటు.. డాక్టర్ల సలహా కూడా అవసరమే. ముషారఫ్ పై అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ ఆయన దేశం రావడానికి అనుమతిస్తామని.. ఎలాంటి అడ్డంకులు సృష్టించబోమని పాక్ ప్రభుత్వం తెలిపింది.