కరోనా వైరస్ నుండి రికవరీ అయ్యే సమయంలో ఈ ఆహారం తీసుకోవడం మంచిది…!

కరోనా వైరస్ తో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రికవరీ అవడానికి కూడా ఎంతో కష్టపడుతున్నారు. రోజుకు ఎందరో మంది మృత్యువాత పడుతున్నారు. అలాగే ఎంతోమంది ఆస్పత్రిలో అడ్మిట్ అవుతున్నారు. ఇటువంటి సమయం లో నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్య సూత్రాలు పాటించాలి మరియు కరోనా సోకకుండా ఉండడానికి కనీసం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

తప్పక మాస్క్ ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం పదేపదే శానిటైజర్ ని వాడడం, బయటికి వెళ్లకుండా ఇంటిపట్టునే ఉండడం లాంటివి చేస్తూ ఉండాలి. అలానే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవడానికి పద్ధతులు పాటించాలి. అయితే కరోనా సమయంలో రికవరీ అవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని మీల్ ప్లాన్స్ ని తీసుకువచ్చింది. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మరియు నీరసం కూడా ఉండదు అయితే మరి ఆ మీన్స్ ప్లాన్ గురించి చూద్దాం..!

Image

మొదట ఉదయం లేచిన తర్వాత నానబెట్టిన బాదం మరియు ఎండు ద్రాక్ష తీసుకోవాలి. బాదంలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఐరన్ కూడా ఇస్తుంది.

అల్పాహారం సమయంలో రాగి దోశ తింటే మంచిది. దీని వల్ల మీకు కడుపు నిండుగా ఉంటుంది.

మధ్యాహ్నం బెల్లం మరియు నెయ్యి కూడా తీసుకోవచ్చు. ఇవి ఎక్కువ పోషకాలు తో నిండి ఉంటాయి కావాలంటే భోజనంలో రోటి తో పాటుగా మీరు వీటిని తీసుకోవచ్చు. ఇవి రికవరీ ఫాస్ట్ కావడానికి ఉపయోగపడతాయి.

రాత్రి పూట ఎక్కువ తీసుకోకుండా చాలా లైట్ గా తీసుకో తీసుకోండి. గట్ ని లైట్ గా ఉంచుతుంది వీటన్నిటి కంటే మంచి నిద్ర చాలా ముఖ్యం.

అలానే ఇప్పుడు ఎండాకాలం కూడా ఉంది కాబట్టి హైడ్రేట్ గా ఉంటూ ఉండాలి. డీహైడ్రేషన్ కు గురి అవకుండా ఉండడానికి ఎక్కువ నీళ్లు, నీళ్ల తో పాటుగా జ్యూస్, బట్టర్ మిల్క్, నిమ్మరసం లాంటివి తీసుకుంటూ ఉండాలి.

ఇవి బాడీ లో మలినాలను తొలగిస్తాయి మరియు మిమ్మల్ని ఫ్రెష్ గా ఉంచుతాయి. అదేవిధంగా మీరు పండ్లు కూడా తీసుకోవచ్చు పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇలా మీరు ఈ జాగ్రత్తలు పాటించడం మంచిది.