ఆంధ్రప్రదేశ్ కి అండగా పని మొదలుపెట్టిన ఆర్మీ…!

-

భారత వైమానిక దళం ఐఎల్ -76 ఇండోనేషియాలోని జకార్తా నుంచి వైజాగ్‌కు రెండు క్రయోజెనిక్ ఆక్సిజన్ కంటైనర్లను ఆదివారం విమానంలో పంపించింది. IAF C17 అనే విమానం.. రెండు ఆక్సిజన్ జనరేటర్లను ఫ్రాన్స్‌లోని బోర్డియక్స్ నుండి హిందాన్ ఎయిర్ బేస్కు తీసుకువస్తోంది. మరో సి 17 విమానం… ఫ్రాంక్‌ఫర్ట్ నుండి ముంబైకి జియోలైట్ (రెస్పిరేటరీ ఆక్సిజన్ ముడి పదార్థం) తీసుకువస్తోంది.

ఇండియాలో రెండు క్రయోజెనిక్ ఆక్సిజన్ కంటైనర్లను హిందన్ నుండి భువనేశ్వర్ వరకు… నాలుగు హైదరాబాద్ నుండి భువనేశ్వర్ వరకు విమానంలో పంపించారు. ఆంధ్రప్రదేశ్ లో ఆక్సీజన్ కొరతను తీర్చడానికి నేవీ అధికారులు ముందుకు వచ్చారు. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ తో పాటుగా నేవీ అధికారులతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరిపింది.

Read more RELATED
Recommended to you

Latest news