గాంధీ ఆసుపత్రిలో ఒకరు చనిపోతేనే మరొకరికి బెడ్ అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఆస్పత్రిలోని అన్ని వార్డుల్లో పడకలు ఫుల్ అయ్యాయి. జిల్లాల నుంచి అంబులెన్సులు తో రోగుల క్యూ కడుతున్నారు. గాంధీ ఆవరణలోనే రోగుల అవస్థలు ఎదుర్కొంటున్నారు. అడ్మిట్స్, బెడ్ల పై సిబ్బంది సమాచారం ఇవ్వడం లేదు. సిబ్బంది కొరత కూడా చాలా తీవ్రంగా ఉంది. సాయంత్రం ఐదు గంటల తర్వాత అడ్మిషన్ కోసం గాంధీ కి రావద్దంటూ వైద్యుల సూచనలు చేయడం గమానార్హం.
గాంధీ లో ప్రస్తుతం 1092 కరోనా రోగులకు చికిత్స చేస్తున్నారు. వెంటిలేటర్ పై 650, ఆక్సిజన్ పడకల మీద 442 మందికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల లోపు వస్తే బెడ్లు దొరికే ఛాన్స్ ఉందంటూ వైద్యుల సూచనలు చేస్తున్నారు.