ఎల్ఐసీ పాలసీతో లోన్.. ఈ రూల్స్ ని తప్పక చూడండి..!

-

చాలా మంది డబ్బు కావలసినప్పుడు లోన్ తీసుకుంటూ వుంటారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇళ్లు, ఎల్ఐసీ పాలసీలను కొల్లాటరల్‌గా పెట్టుకొని బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి. లోన్ తీసుకోవాలంటే ఎవరికైనా ఇల్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ లాంటివి లేనప్పుడు వారి ఎల్ఐసీ పాలసీ ని చూపించి లోన్ తీసుకోవచ్చు. అత్యవసరంగా డబ్బులు కావాలంటే ఇలాంటి రుణాలు తీసుకోవడం ఈజీ.

లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా పాలసీదారులకు వారి పాలసీలపై లోన్ ఇస్తుంది. ఏదైనా తాకట్టు పెట్టి లేదా కొల్లాటరల్‌‌గా చూపించి లోన్ తీసుకుంటే వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. ఏ ప్రూఫ్ లేకుండా తీసుకుంటే వడ్డీ ఎక్కువ పడుతుంది.

అందుకని తక్కువ వడ్డీ కి లోన్ వచ్చే ఆప్షన్స్ ని ఎంచుకోవాలి. ఎల్ఐసీ పాలసీ కనుక మీ దగ్గర ఉంటే ఆ పాలసీ తో మీరు లోన్ తీసుకోవచ్చు. ఎల్ఐసీ పాలసీలతో లోన్ తీసుకునే ముందు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఉదాహరణకు ఒక వ్యక్తి పాలసీని కొల్లాటరల్‌ చూపించి లోన్ తీసుకుంటే… లోన్ మొత్తం తిరిగి చెల్లించకుండానే ఆ వ్యక్తి మరణిస్తే పాలసీ డబ్బులు మొత్తం నామినీకి రావు.

ఆ డబ్బుల్లో లోన్ ఎంత చెల్లించాలో అంత బ్యాంకు కి ఇస్తారు. మిగిలినవి నామినీకి ఇస్తారు. మీ దగ్గర కనుక పాలసీ ఉంటే నేరుగా ఎల్ఐసీ నుంచి లోన్ తీసుకోవచ్చు. పాలసీ సరెండర్ వ్యాల్యూలో 90 శాతం వరకు లోన్ పొందొచ్చు. సరెండర్ వ్యాల్యూ రూ.5,00,000 ఉంటే.. గరిష్టంగా రూ.4,50,000 వరకు లోన్ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news