టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాలో బన్నీ మేనరిజం ఫ్యాన్స్ ను ఓ ఊపు ఊపేసింది. ఈ చిత్రంకు జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు.తాజాగా అల్లు అర్జున్ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. దుబాయ్‌లోని ప్రముఖ మ్యూజియం మేడమ్ టుస్సాడ్స్‌లో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ఈ విషయంపై ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ చేశారు.
అల్లు అర్జున్ తన ట్వీట్‌లో రాస్తూ.. ‘ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైన రోజు.. నా మొదటి చిత్రం గంగోత్రి 2003లో ఈ రోజే రిలీజ్ అయింది.ఇదే రోజు నా మైనపు విగ్రహాన్ని దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రారంభిస్తున్నా అని అన్నారు. నా 21 సంవత్సరాల సినీ కెరీర్ ఒక మరపురాని ప్రయాణం. ఈ ప్రయాణంలో మీలో ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞుడను అని పేర్కొన్నారు. ముఖ్యంగా నా అభిమానుల (ఆర్మీ) అమితమైన ప్రేమ, మద్దతుకు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో మీ అందరూ మరింత గర్వించేలా చేయాలని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు.