పదవ తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫోన్ ని ఇవ్వాలని పోలీసులు అడిగిన విషయం తెలిసిందే. అయితే జైలు నుండి విడుదలైన అనంతరం తన ఫోన్ తో పోలీసులకు ఏం పని అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ ఫోన్ వ్యవహారంలో ఇప్పుడు మరో ట్విస్ట్ నెలకొంది.
పోలీసులు తనని అరెస్టు చేసి సిద్దిపేటకు తీసుకు వెళ్లే సమయంలో అంతవరకు తనతోనే ఉన్న ఫోన్ ఆ తర్వాత పోలీసు వాహనంలో మిస్ అయ్యిందని నేడు కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బండి సంజయ్. తన ఫోన్ మిస్ అయ్యిందని, వెతికి పెట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. 7680006600 నెంబర్ గల తన ఫోన్ మిస్ అయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బండి సంజయ్ ఫోన్ వ్యవహారం ఇప్పుడు వివాదంగా మారింది. అయితే పోలీసులపైనే తనకు అనుమానం ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం.