మీరు ఇలా చేయలేకపోతున్నారా..? అయితే గుండె సమస్య ఉన్నట్లే..!

-

ఈరోజుల్లో గుండె సమస్యలు ఎక్కువయ్యాయి..చిన్న చిన్న పిల్లలే గుండెనొప్పితో చనిపోతున్నారు. ప్రభుత్వాలు కూడా వీటిపై ఆందోళనగానే ఉన్నాయి.. అరే వీళ్లకు కూడా అప్పుడే గుండె సమస్యలు వస్తాయా అనిపిస్తుంది. తెలంగాణలో అయితే సీపీఆర్‌పై అధికారులకు శిక్షణ ఇస్తున్నారు. గుండె ఆరోగ్యంగా ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.. ఇది తెలుసుకోవాడనికి మీరు ప్రతిసారి ఆసుపత్రికి వెళ్లి చెకప్‌ చేయించుకోవాల్సిన అవసరంలేదు.. ఇంట్లోనే చెక్‌ చేసుకోవచ్చు.. దానికోసం ఏం చేయాలంటే..

నేలపై కూర్చుని కాళ్లను ముందుకు చాచాలి. మోకాళ్లను వంచకుండా ముందుకు వంగి కాలి వేళ్లను అందుకోవాలి. ఇలా సునాయాసంగా చేస్తే గుండె సమస్య లేనట్టే లెక్క. అలా కాకుండా మోకాళ్లను ఎత్తాల్సి వచ్చినా, వంచాల్సి వచ్చినా మీరు గుండె సమస్యతో బాధ పడుతున్నట్టు అర్థం చేసుకోవాలి. పొట్ట ఎక్కువగా ఉంటే మీరు కాలి వేళ్లను అందుకోలేరు.. కాబట్టి ముందు పొట్ట తగ్గించండి.. ఇలా మీరు చేయలేకపోతున్నారు అంటే.. వీలు చూసుకునివైద్యులను సంప్రదించండి.. గుండె ఆరోగ్యం ఎలా ఉందో ఒకసారి టెస్ట్‌చేయించుకోండి.

ఈ టెస్ట్‌ నిజంగా గుండె సమస్యను తెలియజేస్తుందా..?

అవును.. నిజంగానే చెబుతుంది. ఇది వాస్తు, జ్యోతిష్యంకు సంబంధించింది కాదు.. సాక్షాత్తూ.. సైన్స్‌కు సంబంధించింది. సైంటిస్టులు పరిశోధనలు చేశాకే చెప్పారు. నార్త్‌ టెక్సాస్‌లో ఉన్న అమెరికన్‌ ఫిజియలాజికల్‌ సొసైటీ వారు 20 నుంచి 83 సంవత్సరాల వయస్సు ఉన్న 526 మందిని పరీక్షించారు. వారికి పైన చెప్పిన విధంగా టెస్ట్‌ చేయమని చెప్పారు. ఆ సమయంలో వారి గుండె పనితీరు తెలుసుకున్నారు. వారు మోకాళ్లను ఎత్తి ముందుకు వంగారా, అలా కాకుండా విజయవంతంగా ముందుకు వంగి కాలి వేళ్లను అందుకున్నారా..? అనే విషయాలను పరిశీలించారు. అనంతరం వచ్చిన ఫలితాలను వారు విశ్లేషించారు. దీంతో వారికి అసలు విషయం తెలిసింది. మోకాళ్లను వంచకుండా నేరుగా వంగి కాలి వేళ్లను అందుకుంటే వారికి ఎలాంటి గుండె సమస్య లేదని, అలా కాకుండా మోకాళ్లను వంచి ముందుకు వంగి కాలి వేళ్లను అందుకుంటే వారికి గుండె సమస్య ఉంటుందని వారు చెప్పారు.

ఇలా చేయడం వల్ల.. మీ గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వారం పాటు సాధన చేస్తే ఈజీగా అందుకోకలుగుతారు.. ఒత్తిడి, ఆందోళన కూడా తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news