ఈజిప్టులో అంతుచిక్కని రహస్యాలు..? మిగిలిపోయిన మిస్టరీలు ఇవే..!

-

ఈజిప్టు అంటే.. వెంటనే మైండ్ లోకి వచ్చేది..మమ్మీలు, పిరమిడ్లు.. ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రపంచం కన్నెరగని గుట్టులు ఈజిప్టులో బోలేడు ఉన్నాయి. రహస్యాలుగా మిగిలిన మిస్టరీలు కోకల్లలు..అందులో కొన్నింటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.. ఇవి కచ్చితంగా మిమ్మలన్ని ఆశ్యర్యానికి గురిచేస్తాయి.!

టుటన్‌ఖామన్ సమాధికి విషం ఉందా..?

ఫారో రాజైన టుటన్‌ఖామన్ (Tutankhamun) సమాధిని ఓ పెద్ద గదిలో ఉంచారు. 1922లో ఆ గదిలోకి పురాతత్వవేత్త హోవార్డ్ కార్టెర్ (Howard Carter) తన బృందంతో కలిసి వెళారు.. వారికి స్మారక చిహ్నం లాంటి ఓ ఫలకం లభించింది. దానిపై “మూసివున్న సమాధిని తెరిచినవారికి తీవ్రమైన శిక్ష తప్పదు” అని రాసివుంది. అది చూసిన హోవార్డ్.. “ఛ..అంతసీన్ లేదు అనుకుని.. ఇలాంటివి నేను అస్సలు నమ్మను” అనడంతో అంతా నవ్వారు. ఐతే… 1930 నాటికి ఆ సమాధి గదిలోకి వెళ్లిన 22 మంది చనిపోయారు. వారి కుటుంబ సభ్యులు కూడా చనిపోయారు. అలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. సమాధి గోడలపై, శవ పేటికపై రాసిన విషం వల్లే వారు చనిపోయారని కొందరు భావిస్తున్నారు. నిజంగానే విషం రాసివుందా అనేది మళ్లీ డౌటే.

గిజా పిరమిడ్‌ (Pyramid of Giza)లో రహస్య గదులు:

గిజా పిరమిడ్లోకి..1993లో ఉపువాత్ 2 అనే చిన్న రోబోని పురాతత్వవేత్తలు పంపారు. దక్షిణం వైపున ఓ చిన్న డోర్‌ ఉంది. దాన్ని దాటి ఆ రోబో లోపలికి వెళ్లింది. అక్కడ ఖాళీ ప్రదేశం కనిపించింది. ఇంకొంచెం ముందుకు వెళ్లగా… అక్కడ మరో డోర్ కనిపించింది. ఆ డోర్ సంగతి ఏంటి అన్నది తెలియలేదు. దాంతో 2010లో మరింత అప్‌గ్రేడ్ అయిన జేడీ (Djedi) రోబోని లోపలికి పంపారు. అది లోపలున్న డోర్ దాటి వెళ్లగా… అక్కడ రాగి కడియాల లాంటివి కనిపించాయి. అలాగే రెడ్ కలర్ పెయింటింగ్స్ ఉన్నాయి. అవి ఎందుకున్నాయో అర్థం కాలేదు. అలాగే… ఆ చీకటి గదుల్లోకి మనుషులెవరూ వెళ్లకపోయినా… మొదటి రోబోకీ, రెండో రోబోకీ మధ్య ఎవరో వెళ్లినట్లుగా… గోడలపై గీతలున్నాయి. అవి తాజాగా ఉన్నాయి. మరి లోపలికి ఎవరు వెళ్లి ఉంటారో అంతుచిక్కని రహస్య్ంగా మిగిలిపోయింది.

గిజా పిరమిడ్ కాలాన్ని చెబుతుందా?

ప్రాచీన ప్రపంచ వింతల్లో ఒకటైన గిజా పిరమిడ్… కాలాన్ని చెప్పగలదు అనే వాదన ఉంది. దీని నిర్మాణం… సూర్య గడియారం లాగా పనిచేస్తుందని అంటున్నారు. రాళ్లలోని గుర్తులపై ఈ పిరమిడ్ నీడ పడే విధానాన్ని బట్టీ… గంటల లెక్క తెలుస్తుందనేది పురాతత్వవేత్తలు మాట. అలాగని దీన్ని టైమ్ కోసం మాత్రమే నిర్మించలేదనీ.. ఉత్తరాయనం, దక్షిణాయనం వంటివి తెలుసుకోవడానికి కూడా దీన్ని ఇలా నిర్మించారని అంటుంటారు.. తద్వారా రోజులు, నెలలు, సంవత్సరాలను ఈజిఫ్షియన్లు లెక్కించేవారట.. ఇందుకు కచ్చితమైన ఆధారాలు మాత్రం లేవు.

పిరమిడ్లను ఏ టెక్నాలజీతో నిర్మించారు..?

పిరమిడ్లను చూస్తే కొండల లాగా ఉంటాయి. నాలుగువైపులా సమానంగా ఉన్న చతురస్రాకార రాళ్లను ఒకదానిపై ఒకటి నిలబెడుతూ పిరమిడ్లను నిర్మించారు. ఆ రాళ్ల మధ్య గ్యాప్ అన్నది లేదు. ఆ గ్యాప్‌ను సున్నపు రాళ్లతో పూడ్చారని కొందరు, అలా జరగలేదని మరికొందరు అంటారు.. ఇక ప్రతి పిరమిడ్ అన్ని వైపులా సమానంగా ఉంటుంది. 4,500 ఏళ్ల కిందట వాటిని అంత పర్ఫెక్టుగా ఎలా నిర్మించారో ఎవరికీ తెలియదు. పైగా అంత పెద్ద రాళ్లను ఒకదానిపై ఒకటి నిర్మించేందుకు వాళ్లు ఏ టెక్నాలజీ వాడి ఉంటారు..? పిరమిడ్‌కి ఓ వైపు ఇసుకను మేటలా వేస్తూ… ఆ ఇసుకపై దుంగలను దొర్లిస్తూ… ఆ దుంగలపై రాళ్లను ఉంచి… పైకి తీసుకెళ్లేవారనే అంచానా కొందరిలో ఉంది.

ఓరియన్ నెబ్యులాకీ, పిరమిడ్లకీ ఏంటి సంబంధం?

మీరు రాత్రివేళ ఆకాశంలో చూస్తే ఓరియన్ నెబ్యులా (Orion Nebula) పక్కన 3 నక్షత్రాలు వరుసగా ఒకే రేఖపై ఉంటాయి. ఆ మూడు నక్షత్రాలకు తిన్నగా… భూమిపై ఈ మూడు పిరమిడ్లను నిర్మించారనే వాదన అక్కడి ప్రజల్లో ఉంది. దీనికి ఆధారాలు లేకపోయినా… ఓరియన్ బెల్ట్‌ (Orion’s Belt of the constellation Orion)కీ పిరమిడ్లకూ సంబంధం ఉందని చాలా మంది బలంగా నమ్ముతున్నారు. ఓరియన్‌ బెల్ట్ లోని నక్షత్రాలకూ ఓసిరిస్ (Osiris)కీ సంబంధం ఉందని చెబుతారు. ఓసిరిస్ అంటే ప్రాచీన ఈజిఫ్టుల దేవుడు. ఆయన చనిపోయిన వాళ్లకు తిరిగి జన్మ ఇస్తాడని అక్కడివారి నమ్మకం. ఈజిప్షియన్లకు పునర్జన్మపై నమ్మకాలు ఎక్కువ. అందువల్ల ఆ 3 నక్షత్రాలకూ, పిరమిడ్లకూ లింక్ ఉందా అనే డౌట్ ఉంది.

స్పింక్స్‌ని ఎప్పుడు నిర్మించారు?

పిరమిడ్ల పక్కన… సింహం శరీరం, మనిషి తలతో ఉండే స్పింక్స్‌ని ఎప్పుడు నిర్మించారన్నది అంతుబట్టని రహస్యంగా ఉంది.. ఎందుకంటే… 19వ శతాబ్దంలో జరిపిన పరిశోధనల్లో… స్పింక్స్‌కి మరమ్మతులు చేసినట్లు కనిపెట్టారు. అసలు స్పింక్స్ ఎప్పటిది అని లెక్కలు వెయ్యగా… 8వేల ఏళ్ల నాటిదిగా అంచనాకు వచ్చింది. అదే నిజం అనుకుంటే… ఈజిఫ్ట్ చరిత్ర అంత పురాతనమైనదా అనే ప్రశ్న తలెత్తుతుంది. గిజా పిరమిడ్ వయసు 4,500గా చెబుతున్నారు. మరి స్పింక్స్‌ని అంతకంటే ముందే నిర్మించారా అన్నది తేలలేదు.
ఇలా పిరిమడ్స్ తో ఫేమస్ అయిన ఈజిప్టులో పిరమిడ్స్ హే పెద్ద మిస్టరీగా మిగిలిపోయాయ్.

Read more RELATED
Recommended to you

Latest news