RRR MOVIE : ఆర్ఆర్ఆర్ నుంచి ”నాటు నాటు” సాంగ్ ప్రోమో.. దుమ్మలేచిపోయిందిగా !

-

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అలాగే.. మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. ఈ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా…. ప్రపంచ వ్యాప్తంగా అందరూ సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. ఈ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ను టాలీవుడ్‌ సంచలన దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాలో బాలీవుడ్ నటి నటులు ఆలియాభట్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరీస్ నటించింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా నుంచి తాజాగా ఓ బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా నుంచి సెకండ్‌ సింగిల్‌ అయిన నాటు నాటు అనే పాట ప్రోమోను విడుదల చేసింది ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర యూనిట్‌. ఈ ప్రోమోలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ చాలా ఎనర్జీ గా కనిపించారు. అలాగే.. లిరిక్స్‌ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక ఈ పూర్తి పాటను రేపు సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news