ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులను కాలరాస్తున్నజగన్మోహన్ రెడ్డిని జాతిపితతో పోల్చడం సిగ్గుచేటని టీఎన్ ఎస్ఎఫ్ రాష్ట్ర విభాగం మాజీ అధ్యక్షులు నాదెండ్ల బ్రహ్మం అన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని లక్షల కోట్లు దోచేసి, 16 నెలలు జైలు జీవితం గడిపిన వ్యక్తిని, అవినీతి మరకలున్న పత్రిక సాక్షి గాంధీతో పోల్చడాన్ని చూసి ప్రజలంతా బాధపడుతున్నారని అన్నారు. వైసీపీ నేతలు, సాక్షి సిబ్బంది కొడాలి నానీ స్కూల్లో చదవబట్టే అటువంటి ఉపమానాలు చేస్తున్నారని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను వయలెన్సుకి వారియర్స్ గా మార్చిందని ఆయన అన్నారు.
ప్రజలంతా వావాలంటీర్లను చెప్పులతో కొట్టాలా…చెట్లకు కట్టేసి కొట్టాలా అనుకుంటున్నారని ఆయన అన్నారు. వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేయాలని విజయవాడలో తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వాలంటీర్ల వ్యవస్థ వచ్చి నేటికి ఏడాది అయిన సందర్భంగా చప్పట్లు కొట్టండి అని పిలుపునిచ్చిన సీఎం పిలుపుకు నిరసనగా ఆందోళనకు దిగారు. వాలంటీర్ల మహిళలను వేధిస్తున్నారని చప్పట్లు కొట్టాలా? లేక మహిళలపై అత్యాచారాలు చేస్తున్నందుకు చప్పట్లు కొట్టాలా? లేక
వాలంటీర్లు ఏటీఎం లో చోరీ చేసున్నందుకు చప్పట్లు కొట్టాలా? అని నాదెండ్ల బ్రహ్మం ప్రశ్నించారు. ఎర్ర చందనం దోపిడీ చేస్తున్నందుకు వాలంటీర్లకు చప్పట్లు కొట్టాలా? అని ఆయన ప్రశ్నించారు. సీఎం ఇకనైనా వాలంటీర్లను అదుపులో పెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు.