తెలుగు రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ప్రస్తుతం నెంబర్ వన్ షో గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. తెలుగులో ఇప్పటివరకు ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో 6వ సీజన్ అతి త్వరలోనే మొదలు కాబోతున్న నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రతి సీజన్లో కూడా సరికొత్త ముఖాలు, ప్రేమలు, టాస్క్ లు, నామినేషన్స్, ఎలిమినేషన్స్, గొడవ, గందరగోళం ఇలా చెప్పుకుంటూ పోతే బిగ్ బాస్ లో జరిగిన అన్నింటికీ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారని చెప్పవచ్చు. ఇకపోతే 6వ సీజన్ కోసం ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ఏడాది ప్రయోగాత్మకంగా ఓటీటీ లోకి కూడా అడుగుపెట్టి బిగ్ బాస్ సూపర్ సక్సెస్ అందుకుంది.
ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 కోసం రంగం సిద్ధం అయ్యింది. యదావిధిగానే ఈ సీజన్ కి కూడా నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. నాగార్జున తాజాగా బిగ్ బాస్ సీజన్ సిక్స్ కు సంబంధించిన ప్రోమోనో విడుదల చేయగా.. లైఫ్ లో ఏ మూమెంట్ అయినా బిగ్ బాస్ తర్వాతే.. బిగ్ బాస్ సీజన్ 6 ఎంటర్టైన్మెంట్ కమింగ్ సూన్..అంటూ ప్రోమోతో చాలా అదరగొట్టాడని చెప్పవచ్చు. ప్రస్తుతం అందుతున్న నివేదిక ప్రకారం మేకర్స్ కంటెస్టెంట్లను ఇంటర్వ్యూ చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది . ఇక అంతా అనుకున్నట్లు జరిగితే 2022 సెప్టెంబర్ 4వ తేదీ నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ప్రారంభమవుతుంది అని ఊహాగానాలు వెళ్లడవుతున్నాయి. ఇది ఇలా ఉండగా నాగార్జున కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.