తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశానికి ముహుర్తం ఖరారు అయింది. ఈనెల 11న అంటే రేపటి రోజున తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో రేపు మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ భేటీ నిర్వహించనున్నారు. రాష్ట్రానికి అదనపు ఆర్థిక వనరులు, ఇతర అంశాలపై మంత్రివర్గం చర్చ జరపనుంది.
ఎఫ్‌ఆర్‌ఎంబీకి లోబడి రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల జారీ ద్వారా తీసుకునే రుణాల్లో కేంద్రం కోత విధించింది. 53 వేల కోట్లలో కేంద్రం 15 వేలు కోట్లు కోత విధించినట్లు ఇటీవల సీఎం కేసీఆర్ తెలిపారు. దీంతో పాటు ప్రాజెక్టులు సహా ఇతరాల కోసం వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయంగా అదనపు వనరుల సమీకరణపై కేబినెట్‌లో చర్చిస్తారు. ఇంకేమిటి సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. అయితే ఆ ప్రకటన ఎలాంటిదనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.