BREAKING : సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం..రూ 20 కోట్ల ఆస్తి నష్టం

-

సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర అగ్ని ప్రమాదంలో ఏకంగా రూ. 20 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లిందని సమాచారం అందుతోంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… సికింద్రాబాద్‌లో ప్రమాదం జరిగింది. సికింద్రాబాద్‌ ఉన్న ఓ క్లబ్‌లో ఆదివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.

దీంతో క్లబ్ అంతటా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. ఇక దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఘటనా స్థలానికి ఏకంగా 10 ఫైర్ ఇంజన్లు చేరుకుని.. మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి.  క్లబ్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో సుమారు రూ. 20 కోట్ల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం తో స్థానికులు పరుగులు పెట్టారు.  అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ అగ్ని ప్రమాద ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

Read more RELATED
Recommended to you

Latest news