నాగాలాండ్ లో ఘోరం జరిగింది. సాధారణ పౌరులపైకి జవాన్లు కాల్పలు జరపడంతో 11 మంది అమాయక ప్రజలు మరణించారు. మోన్ జిల్లాలోని ఓటింగ్ వద్ద ఈ కాల్పులు ఈ సంఘనట చోటు చేసుకుంది. మిలిటెంట్ల కదలికలు ఉన్నాయనే సమాచారంతో… ప్రజలనే మిలిటెంట్లుగా భావించి కాల్పులు జరపడంతో ఈ ఘటన జరిగింది. బొగ్గు గనిలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నవారిపై కాల్పలు జరిపారు. కార్మికులంతా తిరు గ్రామం నుంచి ట్రక్కులో ఇంటికి వెళ్తున్న సమయంలో జవాన్లు కాల్పులు జరిపారు. ఈ పరిణామంతో కోపోద్రిక్తులయిన ప్రజలు బలగాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బలగాాల వాహనాలను తగులబెట్టారు.
ఈ ఘటనపై నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫ్యూ రియో విచారం వ్యక్తం చేశారు. ఘటన జరగడం బాధాకరం అని.. దీనిపై సిట్ విచారణ జరిపిస్తామని తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. అన్ని వర్గాల శాంతియుతంగా ఉండాలని కోరారు.
మరోవైపు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా ఘటనపై స్పందించారు. కాల్పుల ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మృతుల కుటుంబాలకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి సిట్ ఈ ఘటనపై క్షుణ్ణంగా విచారణ జరుపుతుందని హెచ్‌ఎం అమిత్ షా తెలిపారు