బుల్లితెర స్టార్ నటి, జబర్దస్త్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట్లో నటిగా పరిచయమై ఆ తర్వాత యాంకర్ గా దూసుకు పోతోంది అనసూయ. అలాగే స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ తనదైన ముద్రను వేసుకుంది అనసూయ. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసింది అనసూయ.
ఈ సినిమాలో అనసూయ.. దాక్ష్యాయణి అనే ఓ నెగిటివ్ రోల్ లో నటిస్తుంది అని టాక్. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో నుంచి అనసూయ లుక్ లీక్ అయి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ లుక్ లో అనసూయ పైన చీర కొంగు లేకుండా మంచి వ్యక్తిని అత్యంత దారుణంగా చెబుతున్నట్లు మనకు కనిపిస్తోంది. అనసూయ నోటిలో బ్లేడు పట్టుకొని ఇస్తున్నట్లు ఆమె కిల్లర్ లేడిని తలపిస్తోంది. ఇక ఈ లుక్ చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అయితే పుష్ప సినిమాలు సునీల్ భార్య గా అనసూయ నటిస్తున్నట్లు తెలుస్తోంది. నాగ పుష్ప సినిమా డిసెంబర్ 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.