హరీశ్ రావుపై ఈటల సంచలన వ్యాఖ్యలు..నిన్ను కెసిఆర్ వదిలి పెట్టడు !

మంత్రి హరీష్ రావుపై ఈటల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగనాయక సాగర్ కు తీసుకు పోయి తన మనుషులను హరీష్ రావు కొంటున్నాడని ఆరోపణలు చేశారు. హరీశ్ రావు నిన్ను కూడా కెసిఆర్ వదిలి పెట్టబోడని..నీకు తన గతే పడుతుందని పేర్కొన్నారు.

నేరెళ్ళ గ్రామంలో రెండో రోజు ఈటల రాజేందర్ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెరెళ్ళ ధర్మం తప్పదని… ఎవరి ప్రచారం వారిని చేసుకోనివ్వాలని తెలిపారు. అనుమతులు ఇచ్చారు… కానీ జెండాలు తీసేస్తున్నారని మండిపడ్డారు. పిచ్చి పిచ్చి వేషాలు వేయవద్దని..మమ్మల్ని నక్సలైట్లు అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. గులాబీ కండువా వేసుకోండి.. కెసిఆర్ కు బానిసలు అని ప్రకటించుకోండి… కానీ మా జోలికి రావద్దని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వాళ్లు ఎటు పోయారని నిలదీశారు. దళితుల మీద కెసిఆర్ చూపే ప్రేమ ఒక మోసమని… దళిత సీఎం ఎటుపోయింది? అని ప్రశ్నించారు. ”ఉప ముఖ్యమంత్రి నీ ఎందుకు పీకినవ్? మూడు ఎకరాల భూమి ఎటు పోయింది?
పెన్షన్లు ఎటు పోయినాయి? ” అంటూ సిఎం కెసిఆర్ పై నిప్పులు చెరిగారు.