కీసర తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. చంచల్ గూడ జైలులో కీసర తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో మృతదేహాన్ని అధికారులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అవినీతి, లంచం కేసులో నాగరాజు విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చంచల్‌గూడ జైలులో నాగరాజు రిమాండ్ ఉండగా.. ఇవాళ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే కీసర తహసీల్దార్ నాగరాజు పై నమోదైన రెండవ కేసులో ఏసీబీ దూకుడు వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు.
దయరా గ్రామంలోని 48 ఎకరాల విలువైన భూమికి నకిలీ పత్రాలు సృష్టించి మ్యూటేషన్ చేసిన ఎమ్మార్వోతో పాటు ఈ కేసులో 9 మంది ని నిందితులుగా చేర్చింది ఏసీబీ. భూ యజమాని ధర్మారెడ్డి తో పాటు అతని కుమారుడు శ్రీకాంత్ రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ వెంకటేష్, కాంట్రాక్టర్ వెంకటేశ్వర రావు, జగదీశ్వర్ రావు, భాస్కర్ రావు అరెస్ట్ అయ్యారు. అయితే మొదటి కేసులో శ్రీనాథ్, అంజిరెడ్డి, సాయిరాజ్ లకు బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్ట్, రెండో కేసులో కూడా ప్రధాన నిందితుడు గా ఉన్న మాజీ తహసీల్దార్ నాగరాజు కు బెయిల్ నిరాకరించింది. ఆయన అందుకు సంబందించిన డిప్రెషన్ వలెనే ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు.