తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఏంతో గుర్తింపు ఉంది.టాలీవుడ్ లో ప్రేమ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా ఈ కుటుంబం నిలిచింది. నాటి నాగేశ్వరరావు నుంచి నేటి అఖిల్ వరకు వీరిని కుటుంబాన్ని తెలుగు సినీ ప్రేక్షకులు అభిమానిస్తూనే ఉన్నారు.

తెరమీద వీరు నటించిన ప్రేమ కథా చిత్రాలు విజయవంతం అవుతున్నాయి కానీ వీరి వ్యక్తిగత జీవితం లో ప్రేమ వ్యవహారం అసలు అచ్చిరావడం లేదు. ఎందుకంటే ఇటివలే ఈ కుటుంబానికి చెందిన యువ కథానాయకుడు నాగ చైతన్య తన భార్య నటి సమంతా తో విడిపోయిన తర్వాత నుంచి ఇండస్ట్రీలో ఇదే విషయం చర్చలు జరిగాయి.

అసలు ప్రేమ వ్యవహారం లో నాగచైతన్య కంటే తండ్రి నాగార్జున చాలా సీనియర్ అని చెప్పాలి. నాగచైతన్య తల్లి, మూవీ మోఘల్ రామానాయుడు గారి కుమార్తె లక్ష్మీ ని ప్రేమించి పెద్దల అంగీకారంతో చేసుకున్న నాగ చైతన్య పుట్టిన తర్వాత వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయారు.

అసలు నాగార్జున లక్ష్మీ లు విడిపోవడానికి ముఖ్య కారణం నాగార్జున కు ఆనాటి టాప్ హీరోయిన్ లతో ఉన్న సన్నిహిత సంబంధాలు ముఖ్య కారణం అని తెలుస్తోంది. లక్ష్మీ తో విడిపోయిన తర్వాత నాగార్జున నటి అమలా ను వివాహాం చేసుకొన్నాడు. వీరికి అఖిల్ సంతానం.
