తమిళ హీరో కార్తీ తాజాగా నటించిన సినిమా ‘సర్దార్’ ప్రస్తుతం ఈ చిత్రం అక్టోబర్ 21న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా నిన్న ‘సర్దార్’ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కింగ్ నాగార్జున హాజరయ్యారు. ఈ చిత్రాన్ని నాగార్జున స్వయంగా తెలుగులో డబ్బింగ్ చేసి అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా విడుదల చేస్తున్నారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ కార్తీతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. ‘ఊపిరి’ సినిమాతో బాగా దగ్గరయ్యామన్నారు. కార్తీ కి చాలా కష్టపడి పైకి వచ్చాడని, తన అన్నయ్య సూర్య స్టార్ అయినప్పటికీ , తాను సొంత టాలెంట్ తో పైకి వచ్చాడని ఇది సామాన్యమైన విషయం కాదని అన్నారు. తనకు తమిళం లో లాగానే తెలుగు లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది అని అన్నారు.
అలాగే తెలుగు పరిశ్రమలో పవన్ కళ్యాణ్ కూడా అన్నయ్య మెగాస్టార్ ఇమేజ్ నుంచి బయటపడి సొంతగా ఎదిగారు. తనకంటూ ప్రత్యేక మైన స్టైల్ ఏర్పాటు చేసుకుని కెరియర్ లో రాణించారని అన్నారు. ఇప్పుడు తనికి సొంతంగా లక్షలాది మంది అభిమానులు వున్నారని అన్నారు ఇలాంటి నటులు చాలా అరుదుగా ఉంటారు. అందులో కార్తీ కూడా ఉండటం సంతోషంగా ఉందని పొగిడేశారు. దానితో పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ తో హల్చల్ చేస్తున్నారు.