ఈ స్క్రిప్ట్ మీదనే ఆశలు పెట్టుకున్న నాగార్జున .. తేడా వస్తే ఇంతే సంగతులు ?

-

టాలీవుడ్ కింగ్ నాగార్జున గత కొంత కాలం నుండి వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. సోగ్గాడే చిన్ని నాయన ఈ సినిమా తర్వాత చేసిన  మన్మదుడు 2, ‘ఆఫీసర్’, దేవ్‌దాస్ సినిమాలు వరుసగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడ్డాయి. ముఖ్యంగా మన్మధుడు 2 సినిమా కి చాలా విమర్శలు నాగార్జున పై వచ్చాయి. వయసుకు తగ్గ కథలు చేస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు అప్పట్లో సినిమా విడుదలైన తర్వాత ఫ్లాప్ అయిన తర్వాత వినపడ్డాయి.

Image result for nagarjuna

అన్ని రకాలుగా స్టోరీలు సెలెక్ట్ చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయత్నాలు చేసినా గాని సినిమాలు ఫెయిల్ అవ్వటంతో నాగార్జున తాజాగా ఒక కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో సోలోగా ‘వైల్డ్ డాగ్’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ లో చాలా బిజీగా ఉన్నాడు. అయినా గాని సినిమాపై హోప్స్ తక్కువ ఉండటంతో ఈ సినిమా కంటే ఎక్కువగా మరొక సినిమా స్క్రిప్ట్ పై నాగార్జున ఆశలు పెట్టుకున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి.

మేటర్ లోకి వెళ్తే గతంలో సోగ్గాడే లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ సినిమా స్క్రిప్ట్ కి నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది..అంతేకాకుండా ఈ సినిమాపై చాలా హోప్స్ కూడా పెట్టుకున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మార్చి 25న ఉగాది పండుగ సందర్భంగా జరగనున్నట్లు సమాచారం. కాగా నాగార్జున ప్రస్తుతం ఒప్పుకున్న ఈ సినిమాలలో ఏ మాత్రం గత సినిమాల మాదిరిగా బాక్సాఫీస్ దగ్గర తేడా పడితే నాగార్జున కెరియర్ ఇంక అంతే సంగతులు సినిమాలకు రిటైర్మెంట్ ఇవ్వాల్సిందేనని అంటున్నారు సినిమా విశ్లేషకులు.

Read more RELATED
Recommended to you

Latest news