బన్నీ కి తప్ప మిగతా అందరికి నిరాశే మిగిలింది ..!

-

2020 సంక్రాంతికి భారీ అంచనాల మధ్య వచ్చిన మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపుర్రములో సినిమాలు అనుకున్న దానికంటే ఎక్కువ రోజులే థియోటర్స్ లో సందడి చేసాయి. అసలు ఇన్ని రోజులు ఉండటం అనేది కాస్త షాకింగ్ న్యూసే. గత రెండు వారాలుగా మహేష్ , బన్ని సినిమాలకి చెక్ పెట్టగలిగే సినిమా ఒక్కటి కూడా ప్రేక్షకుల ముందుకు రాకపోవడం ఈ రెండు సినిమాలకి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా వీకెండ్ లో మంచి వసూళ్ళని రాబట్టగలిగే అవకాశం దొరికింది.

 

గత శుక్రవారం మంచి అంచనాలతో రిలీజ్‌ అయిన ‘అశ్వథ్థామ’ ఒక మాదిరి వసూళ్లని మాత్రమ్రే రాబట్టింది. అంతేకాదు ‘ఛలో’లాంటి బ్రేక్‌ వస్తుందని నమ్మకంగా ఉన్న నాగశౌర్య నమ్మకాలని వమ్ము చేసింది ‘అశ్వథ్థామ’. ఇక ‘పెళ్లిచూపులు’ వంటి క్లాస్ హిట్ ని అందించిన నిర్మాత రాజ్‌ కందుకూరి .. తన కొడుకు శివని హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన ‘చూసీ చూడంగానే’ సినిమా థియోటర్స్ కి ప్రేక్షకులే రాకపోవడంతో పాపం డెబ్యూ సినిమానే డిజాస్టర్‌ గా మిగిలింది. ‘అల వైకుంఠపురములో’ నూట నలభై కోట్లకి పైగా షేర్‌తో ‘నాన్‌ బాహుబలి’ సినిమాలకి పెద్ద బెంచ్‌ మార్క్‌ సెట్‌ చేసి సక్సస్ ఫుల్ మూవిగా నిలిచింది. అల సినిమాకి ఇప్పటికీ మంచి కలెక్షన్స్ నినమోదు చేస్తూ 50 రోజుల వైపు పరుగులు తీస్తోంది.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’. మహేష్‌ బాబు ఇప్పటి వరకు నటించిన సినిమాలలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా చెప్పుకుంటున్నారు. ఇక మహేష్ తండ్రి కృష్ణ గారైఅతే బ్లాక్ బస్టర్ కా బాప్ అంటూ కామెంట్ చేశారు. తెలుగు రాష్ట్రాలలో లాభాలు చూసినప్పటికి ‘శ్రీమంతుడు’ తర్వాత మళ్లీ మహేష్‌ నటించిన సరిలేరు ‘నాన్‌ బాహుబలి’ రికార్డ్‌ సాధించలేకపోవడం ఆశ్చర్యకరమైన విషయం.

Read more RELATED
Recommended to you

Latest news