కొరటాల క్లాప్ తో మొదలైన నాగశౌర్య కొత్త సినిమా..

-

వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న నాగశౌర్య మరో కొత్త చిత్రాన్ని మొదలుపెట్టాడు. ఆల్రెడీ వరుసలో మరో సినిమా ఉన్నప్పటికీ రెండవ చిత్రాన్ని లైన్లో పెట్టాడు. అనీశ్ క్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ముహూర్తమ్ ఈ రోజు జరుపుకుంది. కొరటాల శివ క్లాప్ కొట్టగా,  హీరో నారా రోహిత్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మాస్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి మొదటి షాట్ కి దర్శకత్వం వహించారు.

ఐరా క్రియేషన్స్ పతాకంపై  తెరకెక్కుతున్న ఈ సినిమాని నాగవంశీ నిర్మిస్తుండగా, ఛలో, భీష్మ సినిమాలకి మ్యూజిక్ అందించిన మహతి స్వర సాగర్ స్వరాలు సమకూరుస్తున్నాడు. కుటుంబ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాతో నాగశౌర్య విజయం అందుకుంటాడేమో చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news