డిప్లమో అభ్యర్థులకు నెలకు 10, 400 స్కాలర్ షిప్ తో పాటు అప్రెంటిస్ శిక్షణ.. !!

-

డిప్లమో చదివిన అభ్యర్థులకు ఒక శుభవార్త.. ఇప్పుడు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఇంజనీరింగ్ డిప్లొమా చదివిన అభ్యర్థుల నుంచి టెక్నీషియన్ అప్రెంటిస్ (TAPP) గా శిక్షణ పొందటానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.అయితే జనవరి 1, 2018 వ సంవత్సరం తరువాత డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా నిర్ణయించింది. అయితే ఈ ట్రైనింగ్ లో ఎంపికైన వారికి అప్రెంటిస్‌షిప్ చట్టం 1961 ప్రకారం నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (నాట్స్) కింద ఒక సంవత్సరం పాటు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL ) బెంగళూరులో శిక్షణ ఇస్తారు.

అంతే కాకుండా ఈ శిక్షణలో ఎంపికైన అభ్యర్థులు నెలకు 10,400 రూపాయల స్కాలర్ షిప్ కూడా పొందవచ్చు. డిప్లమో అర్హత ఉండి, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ చేసుకోవాలి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 15 ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఈలోపు అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. అయితే విద్యార్థులు టెన్త్‌, డిప్లొమాలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక అనేది జరుగుతుంది. అలాగే ఎంపిక అయిన విద్యార్థులకు మెసేజ్ ద్వారా గాని ఈ మెయిల్ ద్వారా గాని ఇన్ఫర్మేషన్ వస్తుంది. ముందగా అభ్యర్థులు http://www.mhrdnats.gov.in/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి.

అయితే అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా ఇంజనీరింగ్ లో మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అంతే కాకుండా బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు విడుదల చేసిన ఒరిజినల్ మార్కుల లిస్ట్‌ తప్పనిసరిగా ఉండాలి. అయితే దీనికి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు అయి ఉండాలి. అలాగే అప్లికేషన్ తో పాటు అభ్యర్థులు వాళ్ళ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్ జిరాక్స్ లు కూడా పంపాలి.

Read more RELATED
Recommended to you

Latest news