నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ డీఎస్పీ కవితపై వేటు

-

తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది.నల్గొండ జిల్లా ఇంటలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు పడింది. డీఎస్పీ కవితను వెంటనే డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆర్డర్స్ పాస్ చేశారు. సమగ్ర విచారణ తర్వాత ఆమెను సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. విధి నిర్వహణలో భాగంగా నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో డీఎస్పీ కవిత అనేక అక్రమాలు, పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడినట్లు భారీగా ఆరోపణలు వచ్చాయి.

ఆమె తన సొంత సిబ్బంది నుంచి సైతం వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం.దీంతో ఆమె అక్రమాలను వెలికితీసేందుకు స్పెషల్ షాడో టీమ్‌ను ఉన్నతాధికారులు ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా రేషన్, గుట్కా మాఫియా నుంచి అక్రమ వసూళ్లు,కింది స్థాయి సిబ్బంది వద్ద చేతివాటం ప్రదర్శించినట్లు షాడో టీమ్ గుర్తించింది. డీఎస్పీ కవితతో పాటు ఓ ఎస్సై, మరో ముగ్గురు కానిస్టేబుళ్లు, ఓ హెడ్ కానిస్టేబుల్ కూడా ఇందులో భాగస్వాములైనట్లు తేలింది. దీంతో డీఎస్పీ కవితను డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ తాజాగా ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వెలువడటం జిల్లాలో సంచలనం రేపింది.

Read more RELATED
Recommended to you

Latest news