మేము చనిపోతాం… ప్రధానికి లేఖ రాసిన రాజీవ్ హత్య కేసు నిందితులు…!

వచ్చే ఏడాది విడుదల అవుతాం, వచ్చే నెల విడుదల అవుతాం, వచ్చే వారం బయటకు వస్తాం అంటూ గత 26 ఏళ్ళుగా జైల్లో మగ్గిపోతున్నారు భారత మాజీ ప్రధాని హత్య కేసు నిందితులు నళిని శ్రీహరన్, ఆమె భర్త మురుగన్. తమను ప్రభుత్వాలు విడుదల చెయ్యాలి అంటూ వాళ్ళు పలుమార్లు విజ్ఞప్తి చేసినా సరే ఫలితం లేకుండా పోతుంది. చివరకు గాంధీ కుటుంబం క్షమించినా సరే వాళ్ళు మాత్రం విడుదలకు నోచుకోలేదు. ఎప్పుడో పెరోల్ పై బయటకు రావడమే గాని వాళ్లకు విముక్తి మాత్రం దొరకడం లేదు.

ఈ నేపధ్యంలో వాళ్ళు ఇద్దరు సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారత ప్రభుత్వం, కోర్ట్ తమ కారుణ్య మరణానికి అనుమతించాలి అంటూ నళిని శ్రీహరన్ మద్రాస్ హైకోర్ట్ లో పిటీషన్ వేసారు. ఈ విషయాన్ని ఆమె తరుపు న్యాయవాది అజెండి మీడియాకు తెలిపారు. “జైలు అధికారుల ద్వారా నలిని ప్రధానమంత్రి కార్యాలయానికి ఒక లేఖ పంపారు. లేఖలో, కారుణ్య మరణాన్ని కోరుతూ గత 26 సంవత్సరాలలో విడుదల అవుతారని వారు ఎంతో ఆశగా ఎదురు చూసారు. కాని ఇప్పుడు ఆ ఆశ క్షీణిస్తోంది అలాగే, జైలు అధికారులు,

తన భర్త మురుగన్‌పై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. తన భర్త పట్ల దురుసుగా ప్రవర్తించడాన్ని ఆమె చూడలేకపోయింది. పుజల్ జైలుకు బదిలీ చేయాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వానికి పిటిషన్ కూడా పంపారని ఆయన పేర్కొన్నారు. జైలు అధికారులు అతని వద్ద నుండి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడంతో మురుగన్‌ను ఏకాంత నిర్బంధానికి పంపారు. ఇక అప్పటి నుంచి నళిని, తన భర్త నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం నిందితులను విడుదల చెయ్యాలని నిర్ణయం తీసుకోగా ఆ ఫైల్ ప్రస్తుతం ఆ రాష్ట్ర గవర్నర్ వద్ద ఉంది.