వచ్చే ఏడాది జనవరిలో సౌతాఫ్రికా వేదికగా జరిగే అండర్-19 ప్రపంచకప్‌లో తలపడే భారత జట్టు వివరాలను సోమవారం వెల్లడించారు. 16 జట్ల మధ్య జరిగే ఈ మహా సంగ్రామం ప్రియం గార్గ్ (ఉత్తరప్రదేశ్)నేతృత్వంలోని భారత జట్టు బరిలోకి దిగనుంది. ఈ మేరకు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఈ మేరకు సెలెక్షన్ కమిటీ ఎంపిక చేసింది. జపాన్ వేదికగా జరిగే క్వాలిఫర్ మ్యాచ్‌లో గ్రూప్ ఏలో న్యూజిలాండ్, శ్రీలంకతో పాటు.. భారత్ తలపడనుంది. ఆ తర్వాత అందులో రెండు జట్లు సూపర్ లీగ్ స్టేజ్‌లో రెండు జట్లు పోటీపడతాయి. అండర్-19 విభాగంలో టీమిండియా ఇప్పటికే నాలుగుసార్లు ప్రపంచకప్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే ఐదవసారి ప్రపంచకప్ కొట్టాలని ఉవ్విళ్లూరుతుంది భారత్.
భారత్ అండర్-19 జట్టు: యశస్వీ జైస్వాల్, తిరల్ వర్మ, దివ్యాంశ్ సక్సేనా, ప్రియమ్ గ్రాగ్(కెప్టెన్), ధృవ్ జురెల్(వైస్ కెప్టెన్-కీపర్), శశ్విత్ రావత్, దివ్యాంశ్ జోషి, శుభాంగ్ హెగ్డే, రవి బిస్నాయ్, ఆకాశ్ సింగ్, కార్తీక్ త్యాగీ, ఆర్తవా అనకొలేకర్, కుమార్ కుషాగ్రా, సుశాంత్ మిశ్రా, విద్యార్థర్ పాటిల్.