సాక్షాలు చూడకుండా కూల్చివేతలు చేపట్టాడు రంగనాథ్ : నల్ల మల్లారెడ్డి

-

హైడ్రా కూల్చివేతల పై నల్ల మల్లారెడ్డి కీలక కామెంట్స్ చేసారు. మా పట్టా లాండ్ పై ఎవరో హైడ్రా కు ఫిర్యాదు చేశారు. దీనిపై హైడ్రా కమిషనర్ మాకు నోటీసులు ఇచ్చాడు. దానికి మా దగ్గర ఉన్న ఆధారాలు అన్ని హైడ్రా కమిషనర్ కి అందించాము. కానీ వాటిని పట్టించుకోకుండా మా కాలనీ లో కూల్చివేతలు చేపట్టాడు హైడ్రా కమిషనర్. లే అవుట్ ప్రొటెక్షన్ కోసం చుట్టూ ప్రహరీ గోడను నిర్మించాం.

ఆ ప్రొటేక్షన్ గోడను ఇప్పుడు కుల్చుతున్నారు.. ఎన్విరాన్మెంట్, అంబియన్స్ కపడలనేదే నా ఉద్దేశం. అందుకే ఎవరు పడితే వాళ్ళ్ళు రాకుండా.. వచ్చే వారి వివరాలు తీసుకుని లోనికి వచ్చేలా ఏర్పాటు చేశాను. ఇక్కడ కొంతమంది గ్రూప్ గా ఏర్పడి నన్ను టార్గెట్ చేశారు. ఒక వాట్స్ ఆప్ గ్రూప్ ఏర్పాటు చేసిన కుట్ర చేశారు. హైడ్రా కమిషనర్ నేను ఇచ్చిన వివరాలు కనీసం చదవకుండా వచ్చి కూల్చివేతలు చేశాడు. గడబడ్ క్రియేట్ చేసి కూల్చివేతలు చేపట్టాడు రంగనాథ్ అని నల్ల మల్లారెడ్డి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version