వీర సింహారెడ్డి ఓ చెత్త సినిమా..బాలయ్య ఫ్యాన్‌ సీరియస్..వీడియో వైరల్ !

-

నందమూరి బాలయ్య ,గోపిచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా వీర సింహారెడ్డి..భారీ అంచనాలతో ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఉదయం 4 గంటలకే మొదటి షో పడింది..ఎప్పటిలాగే ఫ్యాన్స్ హంగామా తారా స్థాయికి చేరింది..సంక్రాంతి పండగను అభిమానులకు రెండు రోజుల ముందే తెచ్చింది ఈ చిత్రం.

అయితే, ఈ సినిమా రిలీజ్‌ నేపథ్యంలోనే హైదరాబాద్‌ లోని ఓ థియేటర్లో ఆసక్తి కర సంఘటన చోటు చేసుకుంది. వీరసింహారెడ్డి అదిరిపోయిందని రివ్యూ చెప్తున్నా ఓ బాలయ్య ఫ్యాన్ కు కోపం తెప్పించాడు తోటి ప్రేక్షకుడు. మైక్ ముందు మాట్లాడుతుండగా పక్కకు వచ్చి సినిమా చెత్తలా ఉందన్నాడు. ఫ్యాన్తో ‘ఆ లుక్ ఏంటి’ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దీంతో కోపం పట్టలేని అభిమాని అతడిని కొట్టడానికి అన్నట్టుగా ఓ కూల్ డ్రింక్ బాటిల్ తో థియేటర్లోకి పరిగెత్తాడు. ఈ వీడియో వైరల్ కాగా ఆ ఫ్యాన్ ఏమి చేసి ఉంటాడో అని చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news