చంద్రబాబు గైర్హాజరీలో టీడీపీని ముందుకు నడిపేది బాలకృష్ణ ?

-

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం మరియు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవెలప్ మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో 14 రోజుల పాటు రిమాండ్ లో ఉన్నారు. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ క్యాడర్ మరియు క్షేత్ర స్థాయి నాయకులు పూర్తిగా డీలా పడిపోయారు అని చెప్పాలి. ఇక మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున చంద్రబాబు జైలులో ఉండదా పార్టీ కార్యక్రమాలకు విఘాతం కలిగాయి. అందుకే చంద్రబాబు గైర్హాజరీలో ఎవరో ఒకరు లీడర్ షిప్ ను ముందుకు తీసుకువెళ్లాసిన అవసరం ఎంతైనా ఉంది. కాగా నారా లోకేష్ సైతం తండ్రి జైలుకు వెళ్లడంతో బెయిల్ కోసం తన ప్రయత్నాలలో మునిగిపోయి ఉన్నాడు. అందుకే తన వియ్యంకుడు మరియు హిందుపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పార్టీని ముందుకు తీసుకువెళ్లే బాధ్యతలను తీసుకుంటారా అన్న టాక్ పొలిటికల్ వర్గాలలో వినిపిస్తోంది. ఇక రీసెంట్ గా బాలకృష్ణ టీడీపీ నేతలతో సమావేశం అయ్యి ఏ విధంగా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి, వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించి ఎలా అధికారంలోకి రావాలి అన్న పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

మరి ఆయనే ఈ పార్టీకి దిక్కు కానున్నాడా ? ఒకవేళ ఇదే జరిగితే పార్టీలో ఉన్న మిగతా సీనియర్లు ఏ విధంగా స్పందిస్తారు అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news