టాలీవుడ్ నటుడు నందమూరి తారకరత్న(40) గత 23 రోజులుగా ప్రాణాలతో పోరాడుతూ శనివారం రోజున కన్నుమూశారు. ఇవాళ తారక్ భౌతిక కాయాన్ని బెంగళూర్ నుంచి హైదరబాద్ తరలించనున్నారు. ఇవాళే తారక్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తారక్ మృతి తో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. అయితే, కాసేపటి క్రితమే బెంగళూరులోని నారాయణ హృదయాలయా ఆస్పత్రి నుంచి హైదరాబాద్ చేరుకుంది తారకరత్న భౌతికకాయం.
మోకిలలోని నివాసానికి తారకరత్న భౌతికకాయం చేరుకుంది. అభిమానుల సందర్శనార్థం రేపు ఫిల్మ్ ఛాంబర్‌కు తారకరత్న పార్థివదేహం ఉంచనున్నారు. ఇక రేపు మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరుగనున్నాయి. అయితే, ఉమ్మడి కృష్ణ జిల్లాలో కీలక నియోజకవర్గమైన గుడివాడ నుంచి తారకరత్న పోటీచేయాలని గట్టి ప్రయత్నాలు చేశారని టాకు నడుస్తోంది. ఈ విషయాన్ని టిడిపి అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్ కు కూడా చెప్పినట్లు సమాచారం. కానీ ఆ కోరిక తీరకుండానే కన్నుమూశారు తారకరత్న.