క్రేజీ కాంబినేషన్.. క్రేజీ టైటిల్.. నాని అదరగొట్టేలా ఉన్నాడు.

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుందని ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా వంటి హిట్ల తర్వాత వివేక్ ఆత్రేయ రూపొందిస్తున్న ఈ సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా ఉండనుందట. ఫిలిమ్ నగర్లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా, పూర్తిగా వినోదాత్మకంగా ఉండనుందట. నాని చేసిన సినిమాలన్నింటిలోకి గుర్తుండిపోయే పాత్రలా ఉంటుందట.

ఐతే ఈ సినిమా టైటిల్ పై వస్తున్న వార్తలు ఆశ్చర్యపరుస్తున్నాయి. నవంబర్ 21వ తేదీన టైటిల్ అనౌన్స్ మెంట్ ఉంటుందని ప్రకటించినప్పటికీ, సోషల్ మీడియాలో ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ వైరల్ అవుతుంది. అంటే సుందరానికి.. అనే టైటిల్ ని నిర్ణయించారని చెప్పుకుంటున్నారు. టైటిల్ లోనే డిఫరెంట్ గా కనిపిస్తున్న ఈ చిత్రం మరింత డిఫరెంట్ గా ఉండనుందని అంటున్నారు. మరి సోషల్ మీడియాలో చెప్పినట్టు ఈ సినిమా పేరు అదేనా కాదా తెలియాలంటే నవంబర్ 21వరకూ ఆగాల్సిందే.