అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఉన్న సమయంలో ఆ దేశంలో ఆంక్షలు విధించడానికి ఎంత మాత్రం కూడా ఆసక్తి చూపించలేదు. ఆయన దెబ్బకు గవర్నర్ లు కూడా నిర్ణయాలు తీసుకోలేదు. అయితే ఇప్పుడు రెండు రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. మిచిగాన్ మరియు వాషింగ్టన్ రాష్ట్రాలు ఆదివారం కొన్ని ఆంక్షలు విధించాయి. వీటిలో ఇండోర్ రెస్టారెంట్ సేవలను నిలిపివేయడం, స్కూల్స్ మూసి వేయడం, ఇండోర్ డిన్నర్ వంటివి నిలిపివేసాయి.
ఇప్పుడు అమెరికాలలో చలికాలం మొదలు కావడంతో ప్రజలు ఎక్కువగా ఇలాంటి వాటికి వెళ్తున్నారు అని నిర్ణయం తీసుకున్నారు. వాషింగ్టన్ స్టేట్ గవర్నర్ జే ఇన్స్లీ, డెమొక్రాట్… అంటే బిడెన్ పార్టీ. ఆయన ట్రంప్ ఉన్నప్పుడు ఆంక్షలు విధించడానికి కంగారు పడ్డారు. ఇప్పుడు ఆయన బిడెన్ సూచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు అని అక్కడి మీడియా వర్గాలు పేర్కొన్నాయి.