కష్టకాలంలో పవన్ అన్న నాకు అండగా నిలిచారు: నారా లోకేష్ !

చంద్రబాబును అరెస్ట్ చేసిన క్షణం నుండి కొడుకు నారా లోకేష్ తీవ్ర బాధలో ఉన్నాడు. మా నాన్నను అరెస్ట్ చేసే దమ్ము ఎవరికి ఉంది అని అనుకున్నాడో ఏమో .. అరెస్ట్ ముందు వరకు చాలా దైర్యంగా ఉన్నా ఆ తర్వాత ఢీలా పడిపోయాడు. తాజాగా నారా లోకేష్ మాట్లాడుతూ, టీడీపీకి మేము అంతా చేస్తున్న యాత్రల వలన ప్రజల నుండి వచ్చే స్పందనను చూసి తట్టుకోలేక ఇలాంటి కుట్రపన్నారు అంటూ ఆవేదనతో మాట్లాడారు. మేము ఎప్పుడూ ఒంటరి వాళ్ళం కాదని.. ప్రజలు ఇచ్చే బలంతో మీలాంటి స్పీడ్ బ్రేకర్ లాంటి అడ్డంకులను దాటుకుంటూ వెళుతామన్నారు నారా లోకేష్. ఇటువంటి కష్ట సమయంలో నేను అన్నగా భావించే పవన్ కళ్యాణ్ మాకు అండగా నిలబడినందుకు చాలా సంతోషంగా ఉందంటూ నారా లోకేష్ జనసేనానిని పొగిడారు.

కొన్ని రోజుల వరకు యువగలం పేరుతో కొనసాగుతున్న పాదయాత్రకు విరామం ఇచ్చామని, మళ్ళీ సమస్యలు అన్నీ సర్దుమణిగిన తర్వాత తిరిగి ప్రారంభిస్తామని హెసెప్పరూ నారా లోకేష్. కాగా చంద్రబాబుకు బెయిల్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు లోకేష్.