పవన్ కళ్యాణ్‌ది మంచి మనసు : నారా లోకేశ్

-

టిడిపి నేత నారా లోకేష్ జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి రావాలంటే మంచి మనసు ఉండాలని, 2014 ఎన్నికల్లో పవన్ లో ఆ మంచి మనసును చూశానని వాక్యానించారు. ఇలాంటి వారు రాజకీయాల్లో ఉండాలని అన్నారు.

ఇక మంగళగిరిలో ఓటమి గురించి మాట్లాడుతూ, టిడిపి అక్కడ రెండుసార్లు మాత్రమే గెలిచిందని, ఆ నియోజకవర్గాన్ని టిడిపికి కంచుకోటగా మార్చేందుకే అక్కడ పోటీ చేశానని చెప్పారు.

అలాగే, ” జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా? అని అడిగారు.. నూటికి నూరు శాతం ఆహ్వానిస్తాం.. ఎవరైతే రాష్ట్రంలో మార్పు ఆశిస్తున్నారో.. ఈ రాష్ట్రం అగ్రస్థానానికి వెళ్లాలి.. ఆంధ్రులు గర్వపడే విధంగా ఉండాలని ఆశిస్తారో? వాళ్ళందరూ రాజకీయాల్లోకి రావాలి..” అంటూ తారక్ పొలిటికల్ ఎంట్రీ పై నారా లోకేష్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news