సుమారు అర్ధసంవత్సర కాలానికిపైగా అవినీతి అక్రమాల కేసుల్లో అరెస్టయిన తమ నేతలకు తప్ప.. ప్రజలకు కనుమరుగైపోయిన నారా లోకేష్.. ఒక్కరోజు అది కూడా అమరావతి ఉద్యమం అని సాగుతున్న కార్యక్రమం 300 రోజు సందర్భంగా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే! ఇలా చాలా కాలం తరువాత ఇలా లోకేష్ బయటకు వచ్చాడో లేదో జగన్ పై విచిత్రమైన వాదన తెరపైకి తెచ్చాడు!
కొంతమందికి కనీసం ఇంగితం కూడా ఉండదు!! ఎందుకు మాట్లాడు తున్నామో, ఎమా మాట్లాడుతున్నామో.. జనం నవ్వుతారేమో అన్న విజ్ఞత కూడా ఉండదు! ఆ సంగతులు అలా ఉంటే… ఒక్క రోజు అమరావతి లో నాలుగు ఊర్లు తిరిగిన లోకేష్… వర్షాలు, వరదలకు జగన్ బైటకు ఎందుకు రావడం లేదు.. వరదలు, బురదలు అసహ్యం కలిగిస్తున్నాయా అంటూ ప్రశ్నించారు!! ప్రస్తుతం ఈ కామెంట్.. లోకేష్ మేధావి తనంపై మరోసారి చర్చించుకునేలా చేసింది!
నేడు తమ పార్టీ ఈ స్థాయిలో ఉండటానికి టీడీపీ నేతల పాలన ఎంత కారణమో అందుకు మరో కారణమైన 3648 కిలోమీటర్ల పాదయాత్ర కూడా ఒక బలమైన కారణం! అలాంటి సమయంలో జగన్ చూడని వర్షాలు కాదు నడవని కష్టాలు కాదు దిగని బురదలూ కాదు! అలాంటి జగన్ ని ఇంతకాలం గుడ్లపై పొదిగిన కోడిలా ఇల్లు వదిలి బయటకు రాని లోకేష్… ఒక్క రోజు అమరావతి వచ్చి, నేను బయటకు వచ్చాను జగన్ వరదకు బురదకు బయపడి బయటకు రావడం లేదు అనడానికి మించిన హాస్యాస్పద కామెంట్ మరొకటి ఉంటుందా?
రాజకీయ నాయకుడు ఒక కామెంట్ చేస్తే… అది ప్రజలకైనా ఉపయోగపడాలి, పార్టీకైనా ఉపయోగపడాలి.. లేదా ప్రత్యర్ధులనైనా ఇరుకునపెట్టాలి! కానీ… చినబాబు స్పెషల్ ట్యాలెంట్ ఏమిటంటే… తాను ఏ విమర్శ చేసినా… అది బౌన్స్ బ్యాక్ అవ్వడమే కాకుండా.. టపాకాయంత సౌండ్ కూడా వస్తుంటుంది!!
దీంతో.. ఇవాళకాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుడు చినబాబు మారతాడని, పరిపక్వత కలిగిన నేతగా మారతాడని, కాస్త పెద్ద మనిషిలా ఆలోచిస్తాడని టీడీపీ నేతలు కార్యకర్తలు తెగ ఆలోచిస్తూ ఆశలు పెట్టుకుంటుంటే.. చినబాబు మాత్రం ఇంకా ఇలాంటి పిల్ల చేష్టలు మానడం లేదు అనేది మరో కామెంట్!!