జగన్ పై నిప్పులుచెరిగిన లోకేష్..!

-

ఈఎస్ఐ కుంభకోణంలో భాగంగా టీపీడీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఈ తెల్లవారుజామున ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. దీనిపై టీడీపీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. అచ్చెన్నాయుడిని ఉద్దేశపూర్వకంగానే అరెస్టు చేశారని ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే అచ్చెన్నాయుడి అరెస్టుపై నారా లోకేష్ మండిపదారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన.. కక్ష సాధింపులో భాగంగానే బీసీ నేత అచ్చెన్నను జగన్ అరెస్ట్ చేయించారని ఆరోపించారు. ఏడాది తుగ్లక్ పాలనలో జరుగుతున్న అరాచకాలను, అన్యాయాలను బయటపెట్టినందుకే అచ్చెన్నాయుడిపై జగన్ పగ పట్టారని వ్యాఖ్యానించారు. బీసీలకు జగన్ చేస్తున్న అన్యాయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించినందుకు గతంలో ఆయనపై వ్యక్తిగత దూషణలకు దిగి జగన్ రాక్షస ఆనందం పొందారని దుయ్యబట్టారు. లక్ష కోట్లు కొట్టేసి, 16 నెలలు ఊచలు లెక్కపెట్టిన జగన్ అందరినీ జైల్లో పెట్టాలనుకోవడం సహజమేనని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉందని, తనకు ఇష్టం వచ్చినట్లు ఎవరినైనా అరెస్ట్ చేయిస్తానని జగన్ అనుకుంటున్నారని విమర్శించారు. బడుగు, బలహీన వర్గాలకు రక్షణగా అంబేద్కర్ రాజ్యాంగం ఉందనే విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలని హితవుపలికారు.

Read more RELATED
Recommended to you

Latest news