టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడి అరెస్టుపై ఆ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. ఆయనపై కుట్రపూరితంగానే అభియోగం మోపారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే ఏసీబీ పూర్తిగా జగన్ డైరెక్షన్ లోనే పని చేస్తోందని టీడీపీ నేతలు పలువురు విమర్శించారు. కాగా , తాజాగా ఈ విషయంపై ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ఎదుగుతున్న బీసీ నేతను చూసి ఓర్వలేక అరెస్ట్ చేశారని వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడి కుటుంబ నిబద్ధత, నిజాయితీ అందరికీ తెలుసన్నారు. బీసీ సంఘాలన్నీ ఇటువంటి దుర్మార్గాలను ఖండించాలని తెలిపారు. ఆరోపణలు, ఆధారాలు లేకుండా అచ్చెన్నాయుడిని ఎలా అరెస్టు చేస్తారని యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.