దావూద్ ఇబ్ర‌హీం, లాడెన్ క‌న్నా నారా లోకేష్ భ‌యంక‌రంగా ఉన్నాడ‌ట‌.. వ‌ర్మ ఫ‌న్నీ ట్వీట్‌..!

-

ఏపీ ఐటీ శాఖ మంత్రి, సీఎం చంద్ర‌బాబు కుమారుడు నారా లోకేష్ గురించి ఎవ‌రికీ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్ప‌టికప్పుడు ఆయన చేసే వ్యాఖ్య‌లు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. అలాగే ఆయ‌న‌కు చెందిన ర‌క ర‌కాల ఫ‌న్నీ ఫొటోలను ప‌లువురు షేర్ చేస్తుంటారు. ఈ క్ర‌మంలోనే నారా లోకేష్‌కు చెందిన ఓ ఫొటో ఇప్పుడు నెట్‌లో వైర‌ల్ అవుతోంది. అది మ‌రెవ‌రో పోస్ట్ చేసింది కాదు, సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ.. ఇప్పుడు నారా లోకేష్‌ను టార్గెట్ చేశాడు. ఆయ‌న‌కు చెందిన ఓ మార్ఫింగ్ ఫొటోను ట్విట్ట‌ర్‌లో పెట్టిన వ‌ర్మ లోకేష్‌పై ప‌లు కామెంట్ల వ‌ర్షం కురిపించాడు. అవ‌న్నీ ఇప్పుడు నెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

ద‌ర్శ‌కుడు వ‌ర్మ నారా లోకేష్‌కు చెందిన ఓ మార్ఫింగ్ ఫొటో నెట్‌లో పెట్టాడు. వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఆ ఫొటోను పోస్ట్ చేసి కామెంట్లు పెట్టాడు. ”అబ్బా.. ఈ ప‌ర్స‌నాలిటీని చూస్తే నాకు భ‌య‌మేస్తుంది. ఇత‌నెవ‌రో నాకు తెలియ‌దు. కానీ ఇత‌న్ని చూస్తే మాత్రం దావూద్ ఇబ్ర‌హీం, ఒసామా బిన్ లాడెన్‌, ప‌రిటాల ర‌విల క‌న్నా చాలా భ‌యంక‌రంగా కనిపిస్తున్నాడు. ఇత‌నెవ‌రో నాకు కొంచెం చెబుతారా.. ప్లీజ్‌..” అంటూ వ‌ర్మ త‌న మొద‌టి ట్వీట్‌ను పెట్టారు.

”అర‌వింద స‌మేత సినిమాలో ఎన్‌టీఆర్‌కు బ‌దులుగా ఈ ప‌ర్స‌నాలిటీని పెట్టి ఉంటే క‌లెక్ష‌న్లు మూడు రెట్లు ఎక్కువగా వ‌చ్చేవి క‌దా..” అని వ‌ర్మ త‌న రెండో ట్వీట్‌ను సంధించాడు. ఇక చివ‌రిగా… ”ఇత‌ను పాలిటిక్స్‌లో ఉన్నాడ‌ని నాకు ఎవ‌రో చెప్పారు. కానీ ఇతనికి సినిమాలు అయితే క‌రెక్ట్‌గా సెట్ అవుతాయి. ఇత‌ని డైలాగ్ డెలివ‌రీ సూపర్బ్‌గా ఉంటుంది. ప్ర‌త్యేకంగా చెప్పాలంటే ప‌దాల ఉచ్ఛార‌ణ ఇత‌ను బాగా చేస్తాడు. ఇత‌ను పాలిటిక్స్‌లో అన‌వ‌స‌రంగా టైం వేస్టు చేసుకుంటున్నాడు. సినిమాల్లో హీరోగా ట్రై చేయ‌వ‌చ్చు క‌దా..” అని వ‌ర్మ నారా లోకేష్‌పై మ‌రో ట్వీట్‌ను పోస్ట్ చేశాడు. దీంతో ఇప్పుడు వ‌ర్మ చేసిన కామెంట్లు తెలుగు త‌మ్ముళ్ల‌ను ఆగ్ర‌హావేశాల‌కు గురి చేస్తున్నాయి. అస‌లే ల‌క్ష్మీఎస్ ఎన్‌టీఆర్ సినిమా రిలీజ్ చేస్తాన‌ని వ‌ర్మ ఇప్ప‌టికే టీడీపీలో గుబులు పుట్టిస్తున్నాడు. దానికి తోడు మ‌ధ్య మ‌ధ్యలో వ‌ర్మ ఇలాంటి సెటైర్లు వేస్తుండే స‌రికి ఎలా స్పందించాలో అవ‌త‌లి వారికి తెలియ‌డం లేదు. చూద్దాం మ‌రి.. ముందు ముందు ఏం జ‌రుగుతుందో..!

Read more RELATED
Recommended to you

Latest news