ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ విమర్శలు కరోనా కన్నా తీవ్రంగా ఉన్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకుంటున్నారు. అయితే తాజాగా టీడీపీ సోషల్ మీడియా విభాగాన్ని ఉండవల్లి అనూషకు అప్పగిస్తున్నట్టు తన పేరిట ప్రచారం అవుతున్న ఓ లేఖపై నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. అది ఫేక్ లేఖ అని స్పష్టం చేశారు. “జగన్ గారూ, నన్ను ఇబ్బందిపెట్టేందుకు పడుతున్న కష్టంలో ఒక్క శాతం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పెట్టినా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారు. అలాకాకుండా, నన్ను టార్గెట్ చేయడమే మీ లక్ష్యమైతే ఆల్ ది బెస్ట్!” అంటూ ట్వీట్ చేశారు.
జగన్ గారు నన్ను బదనాం చెయ్యడానికి పడుతున్న కష్టంలో ఒక్క శాతం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పెట్టినా, ప్రజలు హర్షిస్తారు. లేదు, నన్ను టార్గెట్ చెయ్యడమే మీ లక్ష్యం అయితే ఆల్ ది బెస్ట్.(2/2)#YCPPaytmBatch
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) June 11, 2020
అలాగే కొన్ని ఫేక్ బతుకులు ఎప్పటికీ మారవని, జగన్ వేసే 5 రూపాయల చిల్లర కోసం వైసీపీ పేటీఎం బ్యాచ్ సొంత తల్లిపై తప్పుడు పోస్టు పెట్టే స్థాయికి దిగజారిపోయిందని విమర్శించారు. నేరుగా యుద్ధం చేసే దమ్ములేని దద్దమ్మ జగన్ ఇలాంటి చెత్త పనులు చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడని మండిపడ్డారు.