కరోనా నియంత్రణ చేసేందుకే పెట్రోల్ ధరలు పెంచాం అంటారేమో: నారా లోకేష్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ లపై వ్యాట్ పెంచడంతో తెలుగుదేశం పార్టీ నేతలు అధికార పక్షంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ లో తనదైన శైలిలో విమర్శలు చేశారు. పెట్రోల్, డీజిల్ పై ధరలు పెంచడం సామాన్యుల నడ్డి విరచేయడమేనని నారా లోకేష్ అన్నారు. ‘ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. ధరలు పెంచి మద్యనిషేధం అన్న మేధావి కరోనా కట్టడికి పెట్రోల్ ధరలు పెంచానంటారేమో!’ అని టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.

Nara_Lokesh
Nara_Lokesh

‘బాదుడే బాదుడు. కరోనా సమయంలో విద్యుత్ ఛార్జీలు ఘోరంగా పెంచి పేద ప్రజల కష్టాన్ని దోచుకున్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఇప్పుడు లీటర్ పెట్రోల్‌పై రూ.1.24 పైసలు, డీజిల్ పై 93 పైసలు పెంచేశారు. పెట్రోల్, డీజిల్‍పై అదనపు వ్యాట్‍ను రూ.4కు పెంచడం సామాన్యుల నడ్డి విరచడమే. ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి’, అని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news