గ‌న్న‌వ‌రంలో హెచ్‌సీఎల్ క్యాంప‌స్ ప్రారంభం: నారా లోకేష్‌

-

విజయవాడ: గ‌న్న‌వ‌రం స‌మీపంలోని కీసరవల్లిలో హెచ్‌సీఎల్ క్యాంపస్‌కి మంత్రి నారా లోకేష్ సోమ‌వారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఎల్ సీఈవో రోషిణీ నాడార్ పాల్గొన్నారు. రెండు దశల్లో హెచ్‌సీఎల్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహించనుంది. ఐటీ రంగంలో మొదటి మెగా ఇన్‌వెస్ట్‌మెంట్, రెండు దశల్లో రూ. 750 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. హెచ్‌సీఎల్ ద్వారా 7500 మంది ఉద్యోగాలు రానున్నాయి. మొదటి దశలో రూ.400 కోట్ల పెట్టుబడి, 4వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. మొదటి దశలో ఐటీ రంగంలో పరిశోధన, అభివృద్ధి కేంద్రం ప్రారంభించనున్నారు.హెచ్‌సీఎల్‌తో ఒప్పందం చేసుకున్న 45 రోజుల్లోనే అన్ని అనుమతులతో భూమి పత్రాలను రాష్ట్ర ప్ర‌భుత్వం సంస్థకు అందజేశారు. ఐటీ రంగంలో 2019నాటికి లక్ష ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా హెచ్‌సీఎల్ పెట్టుకుంది. సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా హెచ్‌సీఎల్ క్యాంపస్ ఏర్పాటు చేశామని హెచ్‌సీఎల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి శివశంకర్ తెలిపారు. హెచ్‌సీఎల్ కంపెనీ ఏపీకి రావడానికి మంత్రి లోకేష్ కృషి చేశారని, తొలి దశలో 28 ఎకరాల్లో భారీ క్యాంపస్ నిర్మిస్తున్నామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news