జనసేన నాయకులను రిలీజ్ చేయాల్సిందేనని టీడీపీ నేత నారా లోకేష్ డిమాండ్ చేశారు. విశాఖ విమానాశ్రయం ఘటన పేరుతో పెద్ద సంఖ్యలో జనసేన నాయకులను, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చెయ్యడం దుర్మార్గమని ట్విట్టర్ వేదిక డిమాండ్ చేశారు.
అరెస్ట్ చేసిన జనసేన నేతలను, కార్యకర్తలను వెంటనే విడుదల చెయ్యాలి. Pawan Kalyan గారు బస చేసిన హోటల్ గదులను సోదా చెయ్యడం, అక్కడ ఉన్న నాయకుల పట్ల దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు నారా లోకేష్.
విశాఖలో వైసీపీ రాజకీయ యాత్ర తుస్ మనడంతో…ఆ ఉక్రోషం జనసేన నాయకులు, కార్యకర్తలపై చూపుతున్నట్లు కనిపిస్తుందని చెప్పారు. అటు ఏపీ డీజీపీ కసిరెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ రేంజ్‌లో వార్నింగ్.. ఇచ్చారు. తమ పార్టీ నేతలను తక్షణమే రిలీజ్ చేయండని..లేకపోతే నేనే పోలీస్ స్టేషన్ కు వస్తానని ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్.